- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )


జ‌న‌సేన అధినేత‌, ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం మూడు సినిమాల‌లో న‌టిస్తున్నారు. ఈ మూడు సినిమాల‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఓజీ సినిమాలు న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాల‌లో ముందుగా ‘హరి హర వీరమల్లు’. సినిమా మే 9, 2025న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.పవన్ కళ్యాణ్ ఇటీవలే తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తాను చ‌దువుతున్న సింగ‌పూర్‌ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడటంతో సింగపూర్ కు వెళ్లారు. అదృష్టవశాత్తూ ప‌వ‌న్ కుమారుడు మార్క్ శంకర్ చాలా త్వరగా కోలుకోవ‌డంతో త‌న కుమారుడితో క‌లిసి ప‌వ‌న్ హైద‌రాబాద్‌కు వ‌చ్చేశారు.


ఇక ప‌వ‌న్ అభిమానుల దృష్టి అంతా ఇప్పుడు హరి హర వీర మల్లు చిత్రం వైపు పడింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ కూడా మే 9, 2025. కాబట్టి, ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. మ‌రో వైపు ఓజీ సినిమాకు సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఓజీ కూడా ఈ యేడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తే అస‌లు వీర‌మ‌ల్లు సినిమా పై ట్రేడ్ వ‌ర్గాల్లో ఎంత మాత్రం ఆస‌క్తి లేదు.


అస‌లు ఏరియాల వారీగా చూస్తే వీర‌మ‌ల్లు కు పెద్ద‌గా పోటీ క‌న‌ప‌డ‌డం లేదు. అయితే ఓజీ సినిమాకు మాత్రం అన్ని ఏరియాల్లోనూ బిజినెస్ దుమ్ము లేపుతోంది. పైగా ఆంధ్రా, సీడెడ్‌లో అయితే జ‌నసేన‌కు చెందిన ఎంపీలు... ప్ర‌జా ప్ర‌తినిధులు పోటీ ప‌డి మ‌రీ ఓజీ రైట్స్ సొంతం చేసుకునేందుకు ఆస‌క్తితో ఉన్నారు. గోదావ‌రి జిల్లాల్లో జ‌నసేన ఎమ్మెల్యేలు సిండికేట్ గా ఏర్ప‌డి మ‌రీ ఓజీ రైట్స్  కోసం నిర్మాత‌పై ఒత్తిడి చేస్తున్నారు. దీనిని బ‌ట్టే ఓజీ క్రేజ్ తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: