
ఆ తర్వాత తెరకెక్కించిన అనిమల్ సినిమా వేరే లెవెల్ అని చెప్పాలి . ఒక వైఫ్ ఒక హస్బెండ్ మధ్య బాండింగ్ .. ఒక ఫాదర్ ఒక సన్ మధ్య బాండింగ్ ఎంత రియలిస్టిక్ గా చూపించాడు అనే విషయాన్ని సినిమా చూసిన ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు . మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండే కొన్ని చిలిపి తగాదాలను ఎమోషన్స్ ని చాలా చాలా హుందాగా తెరకెక్కించారు . రష్మిక మందన్నా అదే విధంగా రన్బీర్ కపూర్ ఈ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు . అయితే ఇప్పుడు సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్పిరిట్ . ఇందులో హీరోగా ప్రభాస్ నటిస్తున్నాడు.
సందీప్ రెడ్డి వంగ లాంటి ఒక వైల్డ్ డైరెక్టర్ దర్శకత్వంలో సైలెంట్ హీరో ప్రభాస్ నటిస్తున్నాడు అంటేనే ఆ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు అభిమానులు. ఈ సినిమాకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ అవుతూ ఉంటే రెబల్ ఫాన్స్ గుండెల్లో గిటార్ మోగుతున్నంత ఫీలింగ్ కలుగుతుంది . రీసెంట్గా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ కి విలన్ క్యారెక్టర్ లో ఒక స్టార్ హీరో తండ్రిని చూస్ చేసుకున్నారట సందీప్ రెడ్డివంగా. ఆయన మరెవరో కాదు మలయాళం ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పిలుచుకునే మమ్ముట్టి.
మమ్ముట్టి నటన గురించి యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . వేరే లెవెల్ . మమ్ముట్టి కొడుకే దుల్కర్ సల్మాన్ అన్న విషయం అందరికీ తెలుసు . కాగా మమ్ముట్టి ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తున్నాడట. మమ్ముటి ఇది వరకు కూడా నెగిటివ్ షేడ్స్ లో కనిపించారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ కి తండ్రి పాత్రలో కనిపిస్తూ ఈ సినిమాలో నెగిటివ్ షేద్స్ లో కనిపించబోతున్నారట. ఇప్పటివరకు ఇలాంటి ఒక క్యారెక్టర్ లో మమ్ముట్టి నటించనే నటించలేదు అని మమ్ముట్టికి ఈ క్యారెక్టర్ స్పెషల్ గా నిలిచిపోతుంది అంటున్నారు జనాలు . సోషల్ మీడియా లో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సందీప్ రెడ్డివంగా ఏ డెసిషన్ తీసుకున్న సరే అది వేరే లెవెల్ లో ఉంటుంది. అందులో నో డౌట్ ఇప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ సినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసే రేంజ్ లో ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు..!