
జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో నందమూరి ఫ్యాన్స్ ఆకలి తీర్చేస్తాడు అని అనుకున్నారు . కానీ అది కుదరలేదు . దేవర 2 తో అయినా ఆకలి తీర్చేస్తాడు అని వెయిటింగ్. అయితే దేవర 2 కన్నా కూడా ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే సినిమా పైన హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు. ఎప్పుడో ఓకే చేసిన ఈ సినిమా గురించి ఒక్కటంటే ఒక అప్డేట్ కూడా బయటకు రాలేదు . కానీ రీసెంట్గా లీక్ అయ్యి వైరల్ అవుతుంది ఒక న్యూస్ . ఇది మాత్రం నందమూరి అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో.. విలన్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సలార్ సినిమాలో కేజిఎఫ్ సినిమాలో మనమది చూసాం . అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ ను చూస్ చేసుకున్నారట . రన్వీర్ సింగ్ జూనియర్ ఎన్టీఆర్ కి విలన్ గా నటించబోతున్నారట . ఈ ఒక్క న్యూస్ తో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 31 హ్యాష్ ట్యాగ్స్ మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చాయి. సాధారణంగా ఇలా స్టార్ హీరోస్ అంత పెద్ద హీరోల సినిమాలో విలన్ షేడ్స్ లో నటించడానికి ఒప్పుకోరు . కానీ జూనియర్ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో రన్వీర్ సింగ్ ఈ క్యారెక్టర్ ను చేయడానికి ఒప్పుకున్నారట . ఒక స్టార్ హీరోని మరొక స్టార్ హీరో సినిమాలో ఈ విధంగా చూపించే ధైర్యం చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు నందమూరి అభిమానులు..!