గతేడాది థియేటర్లలో విడుదలైన దేవర సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని సాంగ్స్, బీజీఎం నేషనల్ వైడ్ సంచలనం సృష్టించాయి. దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్ లో వ్యూస్ విషయంలో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. అయితే తాజాగా పీఎం మోదీ ఎంట్రీకి దేవర మూవీ బీజీఎం వాడారు.
 
ఈ విధంగా తారక్ కు అరుదైన ఘనత దక్కిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. తారక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు.
 
దేవర సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సీక్వెల్ కచ్చితంగా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. దేవర సీక్వెల్ సైతం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. ప్రధాని మోదీ శ్రీలంక దేశాన్ని సందర్శించగా అందుకు సంబంధించిన వీడియోకు దేవర బీజీఎంను జత చేయడం జరిగింది.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఏ స్థాయిలో క్రేజ్ పెరుగుతుందో చెప్పడానికి ఇంతకు మించిన ప్రూఫ్ అయితే అవసరం లేదని చెప్పవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు గత కొన్నేళ్లుగా కెరీర్ విషయంలో ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉంది. త్వరలో దేవర సీక్వెల్ కు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: