పేరుకు పెద్ద పాన్ ఇండియా స్టార్.. కానీ వాళ్ళిద్దరికీ అదృష్టం మాత్రం వరించలేదు . రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ గా మారాడు . గ్లోబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . అయినా సరే రామ్ చరణ్ కి ఓ అదృష్టం మాత్రం దక్కలేదు . కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు. మరొక స్టార్ హీరో కూడా ఆ లిస్టులో ఉన్నాడు.  ఆయన మరెవరో కాదు ప్రభాస్ . ఆరడుగుల అందగాడు రెబల్ హీరో స్టార్ ప్రభాస్ కి కూడా అదృష్టం దక్కలేదు .


ఇప్పుడు ఇదే విషయాన్ని ఇండస్ట్రీలో ఉండే జనాలు మాట్లాడుకుంటున్నారు , ప్రభాస్ కి రామ్ చరణ్ కి ఒక దర్శకుడు డైరెక్షన్లో నటించే ఛాన్ ఇప్పటివరకు రాలేదు . పెద్ద స్టార్స్ అయినా కూడా ఎందుకు ఈ ఛాన్స్ రాలేదు అనేది ఇప్పుడి బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆయన మరెవరో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో నటించాలి అని చాలామంది హీరోస్ కోరుకుంటూ ఉంటారు. ఆయన డైలాగ్ రైటింగ్ అంత బాగుంటుంది .



అయితే ఎందుకో చరణ్ తో.. ప్రభాస్ తో ఇప్పటివరకు అలాంటి ఛాన్స్ రాలేదు త్రివిక్రమ్ కి . కొన్నిసార్లు ఆలా వీళ్ల కాంబోలో సినిమా సెట్ అయినా కూడా ఫైనల్ గా ఆగిపోయినట్లు టాక్ వినిపించింది.  ఫ్యూచర్ లోనైనా ఇద్దరు హీరోలు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో కమిట్ అవుతాడు అనే ఆశలు పెట్టుకుంటున్నారు స్టార్ హీరోల ఫ్యాన్స్ . కానీ అలాంటి సిచువేషన్ ఎక్కడా కనిపించడం లేదు . మెగాస్టార్ చిరంజీవి కొడుకు రేంజ్ ఇప్పుడు గ్లోబల్ స్ధాయి కి పాకేసింది . రెబల్ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ఐదేళ్ల కాల్ షీత్స్ ఆల్రెడీ ఫిల్ చేసేసుకున్నాడు . ఈ పరిస్థితుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో చరణ్ - ప్రభాస్ సినిమానా..?  నో వే అంటూ కొట్టి పడేస్తున్నారు ఫ్యాన్స్ . చూద్దాం అసలు ఏం జరుగుతుందో..????

మరింత సమాచారం తెలుసుకోండి: