కుటుంబ గొడవలను కాస్త సినిమా గొడవలుగా మార్చేసి ఫ్యాన్స్ ని రెండు భాగాలుగా చీల్చేశారు . ఆ హీరోలు గమ్మునే ఉన్న ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు . అయితే ఫ్యాన్స్ ఈ రేంజ్ లో రెచ్చిపోతున్న ఇద్దరు హీరోల నుంచి ఒక్క మాట కూడా రాకపోవడం గమనార్హం. అయితే ఇప్పుడు మరొక హీరోయిన్ ఇందులో యాడ్ అయిపోయారు. ఈ ఇద్దరు హీరోలకి ఆ హీరో చాలా జాన్ జిగిడి దోస్త్. అయితే ఇప్పుడు ఒక హీరో కావాలంటే మరొక హీరోని వదులుకోవాలి అలాంటి పరిస్థితి తయారయ్యింది.
మరీ ముఖ్యంగా రీసెంట్గా ఆ హీరో సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంగా మూడు ముక్కలైపోయింది అని.. ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ సినిమాలు కోసమే కష్టపడుతున్నారు అని ..అందరూ కలిసికట్టుగా ఉంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థాయిలో ఉంచొచ్చు అన్న విషయాన్ని మర్చిపోతున్నారని జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ కాకుండా పక్క ఇండస్ట్రీలో బడా సినిమాలు చేసి ఆ ఇండస్ట్రీ బాగుపడేలా చేస్తున్నారు అని కూసింత ఘాటుగానే మాట్లాడుతున్నారు . కుటుంబం మధ్యల గొడవలను ఇప్పుడు ఇండస్ట్రీలకు పాకేలా చేసేసారు ఈ హీరోస్ అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు. నిజమే పర్సనల్ ఇష్యూ ని ఇలా పబ్లిక్ చేయడం కరెక్ట్ కాదు.. మరి అంత పెద్ద స్టార్స్ కి ఈ మాత్రం తెలియదా..?