నేచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ హీరో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ హీరో శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్-3 సినిమాలో నటించారు. హిట్ యూనివర్సల్ లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఇంతకుముందే వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో హిట్-3 సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. మే 1వ తేదీన హిట్-3 సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం,



మేకర్స్ ప్రచార కార్యక్రమాలను శరవేగంగా జరుపుతున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో వరుస హత్యలు వాటిని పవర్ఫుల్ పోలీస్ అధికారి అయిన అర్జున్ సర్కార్ ఎలా చేదించాడు అనే విధంగా ఈ సినిమా తెరకెక్కినట్లుగా ట్రైలర్ లో స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో హీరో నాని చెప్పిన డైలాగులు థియేటర్లలో పూనకాలు తెప్పించడం కన్ఫామ్ అని అంటున్నారు. ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. హిట్ 1, 2 సినిమాలతో పోల్చినట్లయితే హిట్-3 సినిమా కాస్త వైల్డ్ గా ఉందని చెప్పవచ్చు. 

ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ట్రైలర్ లో 'సార్ క్రిమినల్స్ ఉండే భూమి మీద సిక్స్ ఫీట్ సెల్ లో ఉండాలి... లేదా భూమిలో సిక్స్ ఫీట్ హోల్ లో అయినా ఉండాలి. 

క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు' అంటూ అర్జున్ (నాని) డైలాగ్ తో ఈ సినిమా ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ ట్రైలర్ మూడు నిమిషాల నిడివితో ఉండి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా మే 1వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: