
అంతేకాదు ఈ సినిమాలో వర్క్ చేసే ప్రతి నటీనటులకు ఒక స్పెషల్ గుర్తింపు వచ్చేలా ఈ మూవీ ఉండబోతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. కాగా ఇదే మూమెంట్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది . సాధారణంగా ఒక స్టార్ డైరెక్టర్ ఏదైనా కథను రాసుకునేది ఒక హీరోని ఊహించే . అయితే ఆ హీరో ఖచ్చితంగా సినిమా చేయాలని లేదు .. కాల్ షీట్స్ అడ్జెస్ట్ కాకపోయినా.. కథ నచ్చకపోయినా వేరే కారణంగా ఏదైనా సినిమా రిజెక్ట్ చేస్తూ ఉంటారు . అలా ఈ సినిమాను ముందుగా అట్లీ వేరే హీరో కోసం రాసుకున్నారట .
అది కూడా ఒక తెలుగు హీరోనే కావడం గమనార్హం. ఆ హీరో మరెవరో కాదు ప్రభాస్ . ఆరూడుగుల అందగాడు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ . ప్రభాస్ కాల్ షీట్స్ ఎంత బిజీ బిజీగా ఉన్నాయో అందరికీ తెలుసు . దాదాపు 5 ఏళ్ల వరకు వేరే సినిమాకి కమిట్ అయ్యే ఛాన్స్ లేదు . ఆ కారణంగానే అట్లీ సినిమాను వదులుకున్నారట. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ అంతకాలం వెయిట్ చేయలేక..సెకండ్ ఆప్షన్ కింద ఉన్న అల్లు అర్జున్ ని చూస్ చేసుకున్నారట. అల్లు అర్జున్ కధ వినడం..వెంటనే సినిమా ఓకే చేయడం.. సినిమాను వెంటనే సెట్స్ పైకి తీసుకొచ్చేలా మాట్లాడుకోవడం చకచకా జరిగిపోయాయి..!