
ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉంది ..?అక్కడ ఎన్ని సినిమాల పాటలు షూటింగ్ జరిగాయి..? అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. సినిమా షూటింగ్ అంటే ఎక్కువగా హైదరాబాద్ - చెన్నై - ముంబై - ఫారిన్ కంట్రీస్ - స్టూడియోస్ ఇలానే మాట్లాడుకుంటూ ఉంటారు . కానీ కొందరు మాత్రం చాలా న్యాచురాలిటీగా పల్లెటూరి కథ లో తెరకెక్కించే దర్శకులు అందరూ కూడా మనసులో మెదిలేది ఒకే ఒక్క ఊరు పేరు . ఆ ఊరు రామోజీ ఫిలిం సిటీ నే మించిపోయి ఉంటుంది. వందల షూటింగ్స్ జరిగిన ఆ ఊరు మరేంటో కాదు "పొలాచి".
తమిళనాడులో ఉంది . పొలాచీలో దాదాపు 1500 కు పైగా సినిమాలు షూటింగ్ జరిగాయి . అంతేకాదు 5075 లకు పైగా పాటల షూటింగ్స్ ఆ గ్రామంలో జరిగాయి. అంత అందంగా ఉంటుంది పొలాచి . మరి ముఖ్యంగా ఆ నాచురల్ గాలి ఆ చుట్టూ చెట్లు చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. తెలుగు - తమిళం - మలయాళం - కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది స్టార్స్ ఇక్కడికి వచ్చే సినిమా షూటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా పల్లెటూరి కథలకు సంబంధించిన సినిమాలు తెరకెక్కించాలి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పోలాచి . భారత దేశంలో పోలాచి కొబ్బరి కి రాజధాని. ఇక్కడ పండే కొబ్బరి బోండాలకు దేశమంతా మంచి డిమాండ్ ఉంది . అందుకే తమిళనాడులో పోలాచి ఫేవరెట్ షూటింగ్ స్పాట్ గా నిలిచిపోయింది..!