హిందీ బుల్లితెరపై అత్యధికంగా పారితోషకం తీసుకుంటున్నటువంటి నటులలో నటి శ్వేతాతివారి కూడా ఒకరు.. హిందీ భాషలో ఎక్కువ ఆదరణ పొందిన కసౌటీ జిందగీ వంటి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు బాగా సుపరిచితమైంది. ఈ సీరియల్ ద్వారా బుల్లితెర పైన భారీ క్రేజీ సంపాదించుకొని మరి ఏడేళ్ల పాటు ఈ సీరియల్స్ లో కొనసాగింది శ్వేతాతివారి. ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ 4 లో విజేతగా నిలవడం జరిగింది. ఇప్పటికీ కూడా  సీరియల్స్, టీవీ షోల ద్వారా మరింత బిజీ నటిగా పేరు సంపాదించింది శ్వేత తివారి.


ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఎన్నో ఒడిదుడుకులతో కొనసాగింది. ఇప్పటికే రెండుసార్లు ప్రేమ వివాహంలో మోసపోయింది.1998లో ప్రముఖ నటుడు రాజా చౌదరిని ప్రేమించి మరి వివాహం చేసుకున్న వీరికి పాలక్ తివారి అనే అమ్మాయి కూడా జన్మించినది . ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు వీళ్ళ మధ్య రావడంతో 2007లో విడాకులు తీసుకున్నది. అలా ఒంటరిగా జీవిస్తున్న సమయంలో 2013లో శ్వేతా తివారి.. అభినవ్ కోహ్లి ను మళ్లీ ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి రేయాన్స్ కోహ్లీ అనే కొడుకు కూడా జన్మించారు.



అలా జన్మించిన కొద్ది రోజులకి ఈ బంధం కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు. 2019లో వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం శ్వేతాతివారి తన కూతురు కొడుకుతో కలిసి ఉన్నది. ఒకవైపు సీరియల్ ద్వారా బిజీగా ఉన్న శ్వేతాతివారి కూతురు పాలక్ తివారి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. హర్రర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్న దిబూత్ని సినిమాలో నటిస్తున్నదట. డైరెక్టర్ సిద్ధాంత సత్యదేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఒక ఫ్యాషన్ లుక్ వేడుకల పాల్గొన్న పాలక్ తివారి ర్యాంపు వాకతో ఒక్కసారిగా అందరిని అట్రాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఫోటోలు, వీడియోలు చూసి పలువురు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: