
పలు సినిమాలో నటించి మెప్పించింది . కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది . ఆమె ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది . అవకాశాలు ఆమెకు చాలానే వస్తున్నాయి . కానీ బోల్డ్ పాత్రలో నటించకూడదు అని కంటెంట్ ఉన్న పాత్రలోనే నటించాలి అంటూ ఆమె గిరి గిసుకుంది. ఆ కారణంగానే తెరపై ఎక్కువగా కనిపించలేక పోతుంది . అయితే రీసెంట్గా ఒక నెటిజెన్ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు . "2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ తర్వాత నిధి అగర్వాల్ ఏం చేసింది..? ఎన్ని సినిమాలు చేసింది..? అదే 2021లో వచ్చిన శ్రీలీల చూడండి దాదాపు 20 సినిమాలకు కమిట్ అయిపోయింది అంటూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు".
ఇది నిధి కంట కనపడింది. దీంతో వెంటనే ఆమె తనదైన శైలిలో బదులిచ్చింది . "తన గురించి నువ్వు ఏ మాత్రం బాధపడకు అంటూ బాగానే ఘాటుగా బదులు ఇచ్చింది". " ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో మూవీ చేసింది.. తమిళంలో మూడు సినిమాలు చేసింది ..అలాగే హరిహర వీరమల్లకు సంతకం చేసింది మంచి స్క్రిప్ట్ అనుకున్న వాటికే సంతకం చేస్తుంది నిధి అగర్వాల్.. కొన్నిసార్లు నిధి అగర్వాల్ తీసుకున్న నిర్ణయం రాంగ్ అవ్వచ్చు కానీ సినిమాలలోనే భాగం కావాలి అన్నది నిధి అగర్వాల్ అభిప్రాయం .. వరుస సినిమాలకు సైన్ చెయ్యాలన్న తొందర నిధి అగర్వాల్ కి ఏమీ లేదులే నువ్వు జాగ్రత్తగా ఉండు నా గురించి బాధపడుతూ బ్రదర్ "అంటూ కూసింత గట్టిగా ఘాటుగానే ఆన్సర్ ఇచ్చింది . దీనితో పరోక్షకంగా శ్రీలీలకు చంప దెబ్బ తగిలినట్టు అయింది . సోషల్ మీడియాలో ఇప్పుడు నిధి అగర్వాల్ పెట్టిన రిప్లై శ్రీలీల ఫ్యాన్స్ కు మండించేస్తుంది..!!