
అదే టైమ్ తెలుగులో "ఓదెల 2" సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా ఒక నాగసాధువుగా కనిపించబోతుంది. మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో తమన్నా కనిపించబోతుంది. హెబ్బా పటేల్ వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు . ఇటీవల రిలీజైన టీజర్ ట్రైలర్ అంచనాలను వెరే లెవెల్ కి తీసుకెళ్ళింది . ఈ మూవీ ఏప్రిల్ 17వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ కి అటెండ్ అయింది తమన్నా .
అయితే ఇదే మూమెంట్లో తమన్నాకు ఒక ప్రశ్న ఎదురయింది . "ఆఫర్ లేక మీరు ఇలా చిన్న సినిమాలో నటిస్తున్నారా..?" అంటూ సూటిగా ప్రశ్నించారు రిపోర్టర్. దీంతో తమన్నా చాలా హుందా గారి రియాక్ట్ అయ్యింది . "మీరు అన్నమాట చాలా రాంగ్ అండి .. ఎందుకంటే నా దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా ఏది ఉండదు.. కంటెంట్ ఏ సినిమాకైనా ఒకటే .. కంటెంట్ బాగుంటే అది పెద్ద సినిమా అవుతుంది .. బాగోలేకపోతే అది చిన్న సినిమా అవుతుంది.. ఒక కంటెంట్ తెరకెక్కించడానికి ఏ డైరెక్టర్ అయిన ఈక్వల్ గానే కష్టపడతారు. కెరియర్ స్టార్టింగ్ లో నేను నటించిన హ్యాపీడేస్ మూవీ లో ఎనిమిది మంది ప్రధానోపాత్రలో నటించారు. అందులో నేను ఒక దాన్ని అంతే . ఇప్పటికైనా చిన్న సినిమా పెద్ద సినిమా అనడం మానేయండి అంటూ కూసింత గానే రియాక్ట్ అయింది". తమన్నా చెప్పింది నిజమే. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏదీ ఉండదు. హిట్ అయితే అది పెద్ద సినిమా కాకపోతే అది చిన్న సినిమా అవుతుంది అంతే తేడా అంటున్నారు అభిమానులు..!