
ఇక గత ఏడాది స్త్రీ 2 సినిమాలో ఆజ్ కి రాత్ పాట అయితే ఏ రేంజ్ లో హైలెట్ గా మారిందో అందరికీ తెలిసింది .. ఇక ఇప్పుడు నిషా అనే మరో పాటతో మిల్కీ బ్యూటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది .. రైడ్ 2 సినిమాలోని ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో హైలెట్ గా మారింది .. గతంలో హీరోయిన్గా చేస్తున్న సినిమాలకు నాలుగైదు కోట్లు తీసుకున్న తమన్నా ఐటమ్ సాంగ్ కి కూడా దాదాపు కోటి నుంచి రెండు కోట్లకు పైనే అందుకుంటుంది .. అలానే నషా పాటకి కూడా అలానే భారీ మొత్తంలోని తీసుకుందని . ఇలా ఏది ఏమైనా హీరోయిన్గా చేస్తూ మరోవైపు ఐటెం సాంగ్ చేస్తూ 35 ఏళ్ల వయసులో కూడా ఫుల్ ఫామ్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది . ఇదే క్రమంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల 2 అనే తెలుగు సినిమా కూడా ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఇందులో శివశక్తిగా లేడీ అగోరాగా కనిపించనుండటం మరో విశేషం .