
లోకనాయకుడు కమలహాసన్ ప్రస్తుతం బాక్సాఫీస్ ముందుకు వరుస సినిమాల తో రాబోతున్నాడు .. ఇప్పటికే కల్కి , విక్రమ్ సినిమాల తో ఫుల్ ఫామ్ లో ఉన్న కమలహాసన్ .. మద్య లో భారతీయుడు 2 సినిమా తో ప్రేక్షకుల ను కొంత నిరాశపరిచిన . ఆ తర్వాత సినిమాల తో మాత్రం ప్రేక్షకులకు భారీ కిక్ ఇవ్వడాని కి రెడీ గా ఉన్నాడు ఈ సీనియర్ హీరో .. ప్రస్తుతం క్లాసికల్ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్లో ‘థగ్ లైఫ్’ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు .. ఇక దీంతో కమలహాసన్ మరో సినిమా పై ఫోకస్ పెట్టాడు .. అన్బు - అరీవు దర్శకత్వం లో కమల్ 237 వ సినిమా చేయబోతున్నాడు . ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి ..
ప్రస్తుతం అందుతున్న అప్డేట్ ప్రకారం జులై లేదా ఆగస్టు లో ఈ సినిమా షూటింగ్ కు వెళుతుందని తెలుస్తుంది .. అలాగే ఇది కూడా యాక్షన్ అడ్వెంచర్ డ్రామా గా తెరకెక్కబోతుంది . ఈ సినిమా కోసం కమలహాసన్ తన బాడీ లుక్ ని కూడా మార్చుకు నే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది .. ఇదే క్రమం లో పాన్ ఇండియ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా కు సిక్వల్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే .. అలాగే కల్కి 2 షూటింగ్ కోసం కూడా కమలహాసన్ జూన్ నుంచి డేట్స్ ఇస్తున్నారని తెలుస్తుంది .. ఇక ఇందులో వచ్చే మొదటి షెడ్యూల్లో కమలహాసన్ పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తారని కూడా అంటున్నారు . ఇలా ఈ సీనియర్ హీరో వరుస యాక్షన్ సినిమాల తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు .