- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు .. వస్తున్నారు .. వారిలో కొందరు మాత్రమేసక్సెస్ ఫుల్ హీరోయిన్ల గా దూసుకుపోతున్నారు . వీరిలో కొంతమంది హీరోయిన్లు వ‌రుస సినిమాలు చేస్తున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు . అలాంటి హీరోయిన్లలో సయీ మంజ్రేకర్ కూడా ఒకరు .. ప్రస్తుతం ఈ హీరోయిన్ కు అర్జెంటు గా ఒక హిట్ కావాలి ఇప్పుడు .. లేదంటే ఈమె కెరియర్ కష్టాల్లో పడిపోతుంది . అందుకే ఈమె అర్జున్ స‌న్నాఫ్‌ వైజయంతి సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది .. సినిమా యూనిట్ అందరి కంటే సయీ మంజ్రేకర్ కే ఈ సినిమా సక్సెస్ ఎంతో ఇంపార్టెంట్ .. గని లాంటి డిజాస్టర్ సినిమా తో ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చింది ..


ఇక ఆ తర్వాత మేజర్ సినిమా తో కాస్త కోలుకుంది అయితే వెంటనే వచ్చిన స్కంద సినిమా గట్టిగా ఈమెకు షాక్ ఇచ్చింది . స్కంద‌ దెబ్బకు సయీ మంజ్రేకర్ అవకాశాలు కూడా తగ్గిపోయాయి .. ఇక ఇప్పుడు ఎట్టకేలకు కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి సినిమాలో అవకాశం అందుకుంది . ప్రస్తుతం సయీ మంజ్రేకర్ చేతిలో ఉన్న సినిమా ఇదే .. టాలీవుడ్ లో ఈమె కెరియర్ సాఫీగా సాగాలన్న మరిన్ని మంచి అవకాశాలు రావాలన్న ఈ సినిమా హిట్  అవ్వటం ఈమెకు ఎంతో అవసరం .. పైగా తెలుగులో ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉంది .. ఇక ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే సయీ మంజ్రేకర్ కెరియర్ గాడిన పడటమే కాదు ఆ లోటు కూడా భర్తీ చేసినట్టు అవుతుంది .. ఇక మరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి సినిమా ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: