
ప్రతి ఒక్కరి జీవితం లో ఎన్నో కలలు కంటూ ఉంటారు .. అందులో కొందరు మాత్రమే వారు కన్న కలలు నెరవేర్చుకుంటూ ఉంటారు .. మరి కొందరు జీవితం ఎటు వైపు తీసుకెళ్తే అటు వెళ్లిపోతూ ఉంటారు .. అయితే ఈ విషయా ల్లో మాత్రం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో అదృష్టవంతురాలు . ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి నుంచి ఎలాంటి కలలు కన్నాదో ప్రస్తుతం అలాంటి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఆనందం గా గడుపుతున్నానని తెలిపింది .. వెండితెర పై మెరవాలని చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కనేది .. దాని కోసం ఎంతో కష్టపడింది ఎన్నో త్యాగాలు కూడా చేసింది ... ప్రస్తుతం తన డ్రీమ్ లైఫ్ లో ఎంతో హ్యాపీగా జీవిస్తుంది .
అలాగే అందంగా ఉంటేనే వెండితెర పై రాణిస్తారని విషయాన్ని రకుల్ కొట్టి పారేస్తుంది .. అందం అనేది పైకి కనిపించేది కాదని అంతర్గతంగా దాగి ఉంటుంద ని ఈమె చెబుతుంది .. అలాగే మన కళ్ళ ల్లో , నవ్వుల్లో అందం కనిపించాల ని అంటుంది .. అలా కనిపించే ప్రతి ఒక్కరు ఎంతో అందంగా ఉంటార ని కూడా ఈమె అంటుంది . ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పలు హిందీ సినిమాల తో బిజీ గా గడుపుతుంది .. అలాగే ఈమె నటించే రెండు సినిమా లు ఈ ఏడాది లోనే రిలీజ్ అవబోతున్నాయి .. అలాగే మరో వైపు సైఫ్ అలీఖాన్ తో కలిసి రేస్ 4 సినిమా లో కూడా ఈమె నటించి అవకాశం అందుకుంది . ఇలా ఈమె తన అనుకున్న జీవితం లో కలలు కన్నా వెండితెర పై ఎంతో ఆనందంగా గడుపుతుంది .