
దీనిపై నిధి సైలెంట్‌గా ఉండకుండా స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చింది. "2019 తర్వాత నేను తెలుగులో 'హీరో', మూడు తమిళ సినిమాలు చేశాను. ఇప్పుడు 'హరి హర వీర మల్లు', 'ది రాజా సాబ్' సినిమాలు చేస్తున్నా" అని తన సినిమాల లిస్ట్ చెప్పింది. చివరలో కూల్‌గా "బ్రదర్, నా గురించి మీరు వర్రీ అవ్వకండి" అని కూడా యాడ్ చేసింది. నిధి ఇచ్చిన ఈ రిప్లైకి చాలా మంది ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఎంత కూల్‌గా, కాన్ఫిడెంట్‌గా రిప్లై ఇచ్చిందో అని మెచ్చుకున్నారు.
నిధి క్వాలిటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందట. స్టోరీ నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటుందట. పరిగెత్తిపరిగెత్తి సినిమాలు చేయడం తన గోల్ కాదని చెప్పింది. మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమాల్లోనే నటించాలని అనుకుంటుందట. కొన్నిసార్లు తను తీసుకునే డెసిషన్స్ తప్పైనా, తనకి నచ్చినట్టు ఉండటానికే ఇష్టపడుతుందట.
నిధి 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత నాగ చైతన్యతో 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత 'మిస్టర్ మజ్ను' సినిమాలో కూడా చేసింది. కానీ 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం నిధి రెండు భారీ పాన్-ఇండియా సినిమాల్లో నటిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న 'హరి హర వీర మల్లు' సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా మే 9న రిలీజ్ కానుంది. అలాగే ప్రభాస్‌తో కలిసి 'ది రాజా సాబ్' సినిమాలో కూడా నటిస్తోంది. నిధి స్క్రీన్‌పై ఎక్కువగా కనిపించకపోయినా, తన ఛాయిస్‌లను చూస్తే మాత్రం ఇండస్ట్రీలో లాంగ్ టైమ్ ఉండటానికి వచ్చిందని, తన కండిషన్స్‌తోనే ఉంటుందని అర్థమవుతోంది.