బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇన్నేళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా సినిమాల్లో నటిస్తూ తన సొంత కాళ్ల మీద నిలబడుతున్నారు. ఏజ్ మీద పడ్డాక సంపాదించిన ఆస్తి అంతా అనుభవిస్తూ ఇంటి దగ్గర కూర్చొని తినకుండా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న రిచెస్ట్ హీరోలలో అమితాబ్ బచ్చన్ ఒకరు.ఆయన సినిమాలతో కోట్లకు కోట్ల ఆస్తులు సంపాదించడమే కాకుండా ఎన్నో బిజినెస్ లు కూడా చేస్తూ పిల్లల కోసం చాలా కష్టపడుతున్నారు. ఇక ఈయన సినిమాలతో పాటు కౌన్ బనేగా కరోడ్ పతి అనే షోకి హోస్ట్ గా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి షోకి రిటర్మెంట్ ప్రకటించబోతున్నాడు అనే రూమర్లు కూడా వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా అమితాబ్ బచ్చన్ కి నెటిజన్ల నుండి కొన్ని షాకింగ్ సలహాలు ఎదురయ్యాయి.

 అయితే ఒక నెటిజన్ భార్యని పక్కన పెట్టి ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోండి అని సలహా ఇవ్వడంతో ప్రస్తుతం ఆ నెటిజన్ పెట్టిన కామెంట్ కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.మరి ఇంతకీ అమితాబ్ బచ్చన్ ని ఏ హీరోయిన్ ని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ ఖాతాలో ఫాలోవర్స్ ని పెంచుకోవడం కోసం ఏం చేయాలో సలహాలు ఇవ్వండి అని ఒక ట్వీట్ పెట్టాడు. ప్రస్తుతం నాకు 49 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.ఈ సంఖ్యను పెంచుకోవాలంటే ఏం చేయాలో మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని ట్వీట్ చేయగా చాలామంది చాలా రకాలుగా స్పందించారు.

మీ భార్య జయా బచ్చన్ ని అన్ ఫాలో చేస్తే ఫాలోవర్లు పెరుగుతారు అని సలహా ఇవ్వగా మరో నెటిజన్ మీరు మీ భార్యని పక్కన పెట్టి రేఖ ని పెళ్లి చేసుకోండి ఆమెతో ఉన్న ఫోటోలు పెట్టండి ఫాలోవర్స్ చాలామంది పెరుగుతారు అని తెలియజేశారు.ఇక మరో నెటిజన్ పెట్రోల్ మీద స్పందిస్తే మీ ఫాలోవర్లు ఒక్కరోజులో 50 మిలియన్లకు చేరుతారు అని స్పందించారు. అయితే చాలామంది చాలా రకాల సలహాలు ఇచ్చినప్పటికీ కేవలం హీరోయిన్ రేఖని పెళ్లి చేసుకోండి అనే ఓ నెటిజన్ ఇచ్చిన సలహా మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే గతంలో హీరోయిన్ రేఖ అమితాబ్ బచ్చన్ మధ్య ప్రేమాయణం నడిచింది అనే టాక్ ఉండడంతో ప్రస్తుతం మరోసారి వీరిద్దరి మ్యాటర్ తెరమీద చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: