పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే అవకాశం వచ్చినా చాలు అని ఎంతోమంది ఆరాటపడుతూ ఉంటారు.కానీ అలాంటిది ఓ హీరో మాత్రం సినిమాలో అవకాశం ఇస్తానని అంటే అల్లు అరవింద్ ని అవమానించారట.మరి ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. మలయాళం హీరో మమ్ముట్టి అంటే తెలియని వాళ్ళు ఉండరు. అయితే అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం ఇస్తానని అల్లు అరవింద్ అంటే ఆయన్ని మమ్ముట్టి అవమానించారట. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన జల్సా మూవీ అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమాలో విలన్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం మొదట మలయాళ హీరో మమ్ముట్టిని తీసుకుందామని అల్లు అరవింద్ అనుకున్నారట. 

అయితే హీరోగా చేసే మమ్ముట్టిని సినిమాలో విలన్ గా తీసుకోవాలి అనుకోవడానికి ప్రధాన కారణం చాలా మంది సీనియర్ హీరోలు ఇతర ఇండస్ట్రీలో విలన్లుగా చేయడం చూసిన అల్లు అరవింద్ జల్సా మూవీ లో  మమ్ముట్టిని విలన్ పాత్ర కోసం తీసుకోవాలి అనుకున్నారట. అయితే ఇదే విషయాన్ని తన మనసులో అనుకొని ఓ రోజు మమ్ముట్టి కి కాల్ చేసి మేము పవన్ కళ్యాణ్ జల్సా మూవీ లో మిమ్మల్ని ఓ పాత్ర కోసం తీసుకోవాలి అనుకుంటున్నాం అని అల్లు అరవింద్ చెప్పారట. దానికి మమ్ముట్టి ఏ పాత్ర కోసం అని అడగగా విలన్ పాత్ర కోసం అనుకుంటున్నాం అని చెప్పడంతో షాక్ అయినా మమ్ముట్టి ఆహా అవునా..మీరు జల్సా మూవీలో నన్ను విలన్ గా తీసుకోవాలి అనుకుంటున్నారా..

ఇదే పాత్రని చిరంజీవిని వేయమని మీరు అడగగలరా అని తిరిగి రివర్స్ లో ప్రశ్నించారట.అయితే మమ్ముట్టి అడిగిన ప్రశ్నకి షాక్ అయిపోయిన అల్లు అరవింద్ సారీ సార్ అంటూ ఫోన్ పెట్టేసారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అలా పవన్ కళ్యాణ్ జల్సా మూవీ లో మమ్ముట్టిని విలన్ పాత్ర కోసం అడుగుదామని ఫోన్ చేసి చివరికి ఆయనతో ఆ మాటబడి ఫోన్ కట్ చేసుకున్నారట అల్లు అరవింద్.

మరింత సమాచారం తెలుసుకోండి: