మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హ్యాపీడేస్ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న తమన్న బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం తమన్నా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయారు. ఇప్పటివరకు తమన్నా తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ తన కెరీర్ ను కొనసాగిస్తుంది.



ఇదిలా ఉండగా.... తమన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ అవి అభిమానులతో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తమన్నాకు సంబంధించిన ఓ వార్త విపరీతంగా టాపిక్ అవుతుంది. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ రిలేషన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకుంటారని అనౌన్స్ కూడా చేశారు. కానీ ఏమైందో తెలియదు ఈ మధ్యకాలంలో వీరిద్దరూ బ్రేకప్ చెప్పకున్నట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.


 ఇప్పటివరకు తమన్న, విజయవర్మ ఈ వార్తలపై డైరెక్ట్ గా స్పందించనప్పటికీ తమన్నా మాత్రం ఇన్ డైరెక్ట్ గా ప్రేమను వ్యాపారంగా చూస్తే అనేక రకాల సమస్యలు వస్తాయని చెప్పింది. రిలేషన్ షిప్ లో సంతోషం, బాధలను సమానంగా స్వీకరిస్తేనే సంతోషంగా ఉంటామంటూ విజయ వర్మ అన్నారు. దీంతో వీరి బ్రేకప్ కి సంబంధించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలపై విజయ వర్మ, తమన్నా ఎవరో ఒకరు స్పందిస్తే గాని అసలు విషయం తెలియదు. ఇక తమన్నా తాజాగా తన పెళ్లి గురించి స్పందించారు. ప్రస్తుతానికి వివాహం చేసుకునే ఆలోచనలు లేవంటూ తమన్నా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరూ నిజంగానే విడిపోయినట్టు ఉన్నారని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: