టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. అందులో అలనాటి అందాల తార నటి త్రిష ఒకరిని చెప్పవచ్చు. ఈ చిన్నది వర్షం సినిమాతో ఫుల్ ఫేమస్ అయ్యింది. ఆ సినిమా అనంతరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. ఇప్పటివరకు త్రిష తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపును అందుకుంది. ప్రస్తుతం త్రిష వరుస సినిమా షూటింగ్ లలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 


త్రిష కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ అనేక సినిమాలలో నటించింది. త్రిష వయసు 40 ఏళ్లకు పైనే అయినప్పటికీ ఇంత వరకు వివాహం చేసుకోలేదు. కానీ ఓ తమిళ హీరోతో ప్రేమలో ఉన్నట్లు రిలేషన్ కొనసాగించినట్లు అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం త్రిషకు సంబంధించి ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతోంది. సినిమాలలో ఎంతో బిజీగా ఉండే త్రిష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే త్రిషకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. త్రిష సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఓ తమిళ హీరోను ప్రేమించిందట. అంతే కాకుండా అతడిని వివాహం చేసుకుంటానని చెప్పిందట. కానీ ఏమైందో తెలియదు ఆ హీరోను ప్రేమించి, పెళ్లి చేసుకుంటారని త్రిష మోసం చేసినట్లుగా అనేక రకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం బయటికి రాలేదు. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఈ విషయం పైన త్రిష ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: