టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది క్యూట్ కపుల్స్ ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి దంపతులు ముందు వరుసలో ఉంటారు. ఈ జంట చాలా కాలం పాటు ప్రేమించుకుని కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వారి వివాహాన్ని జరుపుకున్నారు. వివాహం తర్వాత అల్లు అర్జున్, స్నేహ రెడ్డి వారి వైవాహిక జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా కొనసాగించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్న సంఘటన తెలిసిందే. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.


తన అంద చందాలతో సోషల్ మీడియాను ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో స్నేహ రెడ్డికి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్నేహ రెడ్డి పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తాయి. స్నేహ రెడ్డి తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకోవడం ఈ బ్యూటీకి అలవాటు. ఇక స్నేహ రెడ్డి తరచూ వెకేషన్స్ కి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకోవడం అవి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

 
ఈ క్రమంలోనే స్నేహారెడ్డి తన పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ నేచర్ కి సంబంధించిన ఓ అందమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అంతేకాకుండా ఆ వీడియోలో కల్లు చెట్టు, కల్లు కుండ ఫోటోలు కూడా ఉన్నాయి. తన పిల్లలతో కలిసి ఈ ట్రిప్ లో స్నేహ రెడ్డి చాలా సంతోషంగా ఎంజాయ్ చేసినట్టుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది అల్లు అర్జున్ లేకుండానే ట్రిప్ కి వెళ్ళారా అని కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లపై స్నేహ రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: