నేచురల్ స్టార్ నాని గత కొద్ది రోజుల నుండి చేతినిండా సినిమాలతో పాటు వరుస హిట్లతో జోరు మీదున్నాడు. ఈయన ఇప్పటివరకు నటించిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్.. అలా నాని నటించిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో ఈయన నిర్మాతలకి బంగారు బాతుగా మారిపోతున్నారు. దసరా మూవీ తో 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈయన సరిపోదా శనివారం,హాయ్ నాన్న వంటి సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో చేరారు. అయితే అలాంటి హీరో నాని త్వరలోనే హిట్ -3 సినిమాతో మరొకసారి తన అభిమానులను పలకరించబోతున్నారు. రీసెంట్ గానే ఆయన బ్యానర్ లో చిన్న సినిమాగా వచ్చి అతి పెద్ద హిట్ అయిన కోర్టు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆనందంలో ఉన్న నాని అభిమానులు త్వరలోనే మళ్లీ నాని హిట్-3 సినిమా కూడా విడుదల కావడంతో ఆనందోత్సహాల్లో మునిగిపోతున్నారు. 

అయితే నాని నటించిన హిట్ -3 మరి కొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉండడంతో తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమంలో కొంతమంది విలేకరులు మీరు రీసెంట్ గానే 100 కోట్ల క్లబ్ లో చేరారు.కాబట్టి టైర్ -1 హీరోల జాబితాలో చేరినట్టేనా అని విలేకరులు ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్న నానికి అస్సలు నచ్చలేదు కావచ్చు. ఎందుకంటే ఈ ప్రశ్న రావడంతోనే నాని టైర్ -1,టైర్-2 అనే పదాన్ని మనమే సృష్టించాము.

దాన్ని మనమే కొనసాగిస్తున్నాము. కానీ ఒక నటుడికి ఎలాంటి సినిమాలు అయితే కరెక్ట్ గా సెట్ అవుతాయో అలాంటి సినిమాలే వస్తాయి. కానీ ఇది గ్రహించకుండా ఆ హీరో హీరోయిన్లను సపరేట్గా చేసి ఆ పేర్లతో ఎందుకు పిలుస్తారో నాకు అర్థం కావడం లేదు. అదో స్టుపిడ్ పదం..ఆ పదాన్ని ఎవరు స్టార్ట్ చేశారో కానీ ఇండస్ట్రీలో దాన్ని ఇప్పటివరకు కొనసాగిస్తూనే ఉన్నాము. కానీ టైర్-1 టైర్-2 అనే పదాన్ని వదిలేస్తేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇండస్ట్రీలో ఉన్నా వాళ్లందరూ హ్యాపీగా ఉంటారు అంటూ నాని విలేకరుల ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: