
ఈమె తన అందం, అభినేయంతో ఎంతమంది ప్రేక్షకుల మనసును దోచుకుంది. సమంతా రూత్ ప్రభు నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అందాల భామ గతంలో ఆరోగ్యం బాగలేక సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే సమంతా మళ్లీ సినిమాలలో కనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా సమంతా రూత్ ప్రభు మళ్లీ హాస్పటల్ లో బెడ్ పైన కనిపించారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానికి సామ్ అభిమానులు, శ్రేయోభిలాషులు సామ్ త్వరగా కొలుకోవాలని కామెంట్స్ రూపంలో తెలిజేశారు.
అయితే ఈ అందాల భామ ఏ పోస్ట్ పెట్టిన సరే లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి. సమంతకి కేవలం టాలీవుడ్ లోనే కాదు, అటు బాలీవుడ్.. ఇటు కొలివుడ్ లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సామ్ అంటే ఇష్టపడని వారుండారు. ఈమె గతంలో అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని కారణాల వాళ్ల వీరిద్దరూ విడిపోయారు. ఇటీవలే నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సామ్ ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో.. ఇప్పుడిప్పుడే సినిమాలలోకి వస్తుంది. ఇప్పుడు సమంత సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.