టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన అందచందాలతో మంచి గుర్తింపుని సంపాదించుకుంటారు. ఇక మరికొంతమంది నటన, అందం ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా సక్సెస్ కాలేకపోతారు. అలాంటి వారిలో నటి నిధి అగర్వాల్ ఒకరు. ఈ చిన్నది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెదట్లో తన నటన అందచందాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ సినిమాలలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. వరుసగా సినిమా అవకాశాలను అందుకోలేక ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది.


 ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్  కొనసాగించింది. ఇక నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా.... సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ అవి సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతుంది.


ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ కు ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ఓ టాలీవుడ్ హీరోయిన్ తో ఈ బ్యూటీని పోలుస్తూ కామెంట్ చేశాడు. దీంతో నిధి అగర్వాల్ ఆ నెటిజన్ కి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. అయితే నిధి అగర్వాల్ ను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీలతో పోలుస్తూ కామెంట్ చేశారు. దీంతో నిధి అగర్వాల్ తనదైన స్టైల్ లో స్పందించారు. త్వరగా సినిమాలు చేసేయాలని ఉద్దేశం నాకు లేదంటూ నిధి అగర్వాల్ అన్నారు. మంచి స్క్రిప్ట్ లు సెలెక్ట్ చేసుకుని ఇండస్ట్రీలో చాలా కాలం పాటు నిలవాలని తన కోరిక అని నిధి అగర్వాల్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం నిధి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: