అన్నా లేజీనావో ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్యగా అన్నా లేజీనావో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. వివాహానికి ముందు కొన్ని సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో ప్రేమ, వివాహం తర్వాత అన్నా లేజీనావో పేరు తెరపైకి వచ్చింది. అన్నా లేజీనావో పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి నటించిన సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. అనంతరం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి పిల్లలు కూడా ఉన్నారు. 

రీసెంట్ గానే మార్క్ శంకర్ సింగపూర్ లోని సమ్మర్ క్యాంప్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో పవన్ కళ్యాణ్ కుమారుడు గాయాల పాలయ్యాడు. కేవలం చిన్నపాటి గాయాలే కావడంతో మార్క్ శంకర్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. నల్ల పొగను పీల్చడం వల్ల మార్క్ శంకర్ అనారోగ్యం పాలయ్యాడు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేజీనావో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా తలనీలాలు కూడా సమర్పించారు.


తన కుమారుడికి ఎలాంటి ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటికి వచ్చినందువల్ల అన్నా లేజీనావో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజీనావో క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ ధర్మాన్ని ఎంతగానో ప్రార్థిస్తారు. ఇక తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి తన వంతుగా కొన్ని డబ్బులను కూడా తిరుమలలో సమర్పించారు. కాగా అన్నా లేజీనావో ఇలా చేయడం పట్ల టాలీవుడ్ సినీ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.


హిందూ మతాన్ని అనుసరించే తాను మిమ్మల్ని చూసి ఎంతో గర్విస్తున్నానంటూ సనాతన ధర్మాన్ని మీ భర్త పరిరక్షిస్తుంటే, అన్యమతం నుంచి వచ్చి హిందూ మతాన్ని ఇంతలా గౌరవిస్తున్న మీ మనస్తత్వాన్ని కచ్చితంగా అభినందించాలి అంటూ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం అన్న లేజినావో మంచితనాన్ని చూసి ప్రతి ఒక్కరు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: