
దీనికితోడు లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీ ట్రైలర్ అందరికీ బాగా నచ్చడంతో ఈమూవీ తనకు ఖచ్చితంగా హిట్ ఇస్తుందని కళ్యాణ్ రామ్ ఆశపడుతున్నాడు. ‘కోర్ట్’ మూవీ తరువాత ఇప్పటివరకు విడుదలైన సినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో తన సినిమా పై కళ్యాణ్ రామ్ అంచనాలు పెరుగుతున్నాయి. ఈమూవీకి బిజినెస్ పరంగా మంచి ఆఫర్లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈసినిమాకు పోటీగా తమన్నా నటించిన ‘ఓదెల 2’ విడుదల కాబోతోంది. ‘బాహుబలి’ తరువాత తమన్నా ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు ఏపాత్రలోను రాలేదు. ఇలాంటి పరిస్థితులలో శివశక్తి గా ఆమె విభిన్నపాత్రలో నటిస్తున్న ‘ఓదెల 2’ పై ఆమె చాల ఆశలు పెట్టుకుంది. ఆమె ఈమూవీలో చెప్పే డైలాగ్స్ భారీ స్థాయిలో ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది.
గత కొంతకాలంగా తమన్నా ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు వద్ద ధ్యానం యోగా కు సంబంధించిన అనేక విషయాలు ఈమె తెలుసుకోవాడమే కాకుండా రోజుకు రెండు మూడు గంటలు ఆమె యోగా మరియు ధ్యానం చేస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పింది. దీనితో అనుకోకుండా వచ్చిన శివశక్తి పాత్రలో తమన్నా బాగా నటించిందని చాలామంది చెపుతున్నారు. ఈసినిమాకు కూడ ప్రమోషన్ బాగా చేస్తున్నారు. దీనితో ఈవారం విడుదల కాబోతున్న కళ్యాణ్ రామ్ విజయశాంతి ల ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కి ఏమైనా తమన్నా చెక్ పెట్టగలదా అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి..