
పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్లో అగ్నిప్రమాదంలో గాయాలు అయ్యాయి. అక్కడ చికిత్స పొందుతున్న మార్కు శంకర్ కోలుకోవడం జరిగింది. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మాత్రం మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. ఒకానొక సమయంలో అటు అల్లు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ సైతం కొట్టుకునే స్టేజ్ కి వెళ్ళిపోయారు.
అల్లు అరవింద్ లాంటివారు కూడా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో అవి బయటపడుతున్నాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడంతో ఈ రూమర్స్ అన్నిటికీ కూడా చెక్ పడిందని కూడా చెప్పవచ్చు. మరి ఇకనైనా ఫాన్స్ వార్ అనేది ఆగిపోతుందేమో చూడాలి మరి. అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ అట్లీతో ఒక బడా ప్రాజెక్ట్ లో నటించబోతున్నారు. ఇటీవల ఏ సినిమాకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ వీడియోను కూడా విడుదల చేశారు.