
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా మన తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో చేసిన మొదటి సినిమా థియేటర్స్ లో దూసుకు పోతోంది. జాట్ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా కు రిలీజ్ రోజు నుంచే అదిరిపోయే మాస్ సినిమా అన్న టాక్ వచ్చింది. ఇక జాట్ సినిమా మాస్ అభిమానులతో పాటు హీరో సన్నీ ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ని అందిస్తుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఒకింత తక్కువ వసూళ్లే రాబట్టింది. ఓపెనింగ్స్ పరంగా లెక్కలు వేసుకుంటే కాస్త తక్కువ గానే ఉన్నా వీకెండ్ కి మాత్రం క్రమంగా వసూళ్లు పెంచుకుంటూ వెళ్ళిందనే చెప్పాలి.
ఇక జాట్ సినిమా శనివారంకి ఆదివారంకి 4 కోట్లకి పైగా నెట్ వసూళ్లు ఎక్కువ సాధించి ఇండియా వైడ్ గా రు. 40 కోట్ల మార్క్ టచ్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ అయితే ఇప్పటి వరకు మొత్తం రు . 49.3 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేయడంతో జాట్ సాలిడ్ వీకెండ్ అందుకుని బాగా జంప్ చేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు మన టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ . థమన్ సంగీతం అందించగా రణదీప్ హూడా విలన్ రోల్ లో నటించాడు. అలాగే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రం తోనే బాలీవుడ్ లో ఎంటర్ అయ్యి .. తొలి ప్రయత్నంలో నే మంచి సక్సెస్ కొట్టారు. ఇక మైత్రీ - మలినేని గోపీచంద్ కాంబోలో బాలయ్య హీరోగా మరో ప్రాజెక్ట్ సెట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. గతంలో ఈ కాం బో లో వీరసింహా రెడ్డి సినిమా వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.