జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా హాజరయ్యారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నో చిత్రాల ప్రీ రిలీజ్ వేదికల మీద కూడా కనిపించడం జరిగింది. తన సినిమాలతో పాటు తన అన్న కళ్యాణ్ రామ్ సినిమాలో ఈవెంట్ కి కచ్చితంగా ఎన్టీఆర్ వస్తు ఉన్నారు. అయితే ఈ రోజు కూడా ఎన్టీఆర్  ఎప్పుడూ కూడా ఎలాంటి వైవిధ్యమైన కామెంట్స్ అయితే చేయలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు.


త్వరలో రాబోయే వార్ 2 ఈవెంట్ కి కూడా ఎన్టీఆర్  కచ్చితంగా వస్తారు.. ఇదంతా పక్కన పెడితే డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ప్రాజెక్టు మొదలైన నేపథ్యంలో ఆ సినిమా గురించి ఒక న్యూస్ వినిపిస్తోంది. ఇటీవలే సినిమా షూటింగ్ను కూడా మొదలుపెట్టారు. అయితే ఇటువంటి సమయంలో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయట. ఎన్టీఆర్ ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారని కళ్యాణ్ రామ్ తన ఈవెంట్లకి తప్ప ఇతర హీరోల ఈవెంట్లకి హాజరు కాకూడదని ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి లుక్ రివిల్ కాకూడదని విషయం పైన ఎన్టీఆర్ జాగ్రత్త తీసుకొని మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 22 నుంచి ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్సినిమా కోసం చాలా సన్నబడడం జరిగింది. రెండు షెడ్యూల్స్  చిత్రీకరించిన అనంతరం ఎన్టీఆర్ మళ్లీ బరువు పెరగాల్సి ఉంటుందట. ఈ నేపథ్యంలోనే లుక్ పరంగా చాలా మార్పులు కూడా వస్తాయని దీంతో  ఎన్టీఆర్  బయటికి వస్తే మాత్రం ఎన్టీఆర్ లుక్ రివిల్ అవుతుందని భావించిన ప్రశాంత్ నీల్ ఒక కండిషన్ కూడా పెట్టారట. వార్-2 సినిమా తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ ఏ ఈవెంట్ కి కూడా హాజరు కాకూడదని కండిషన్ పెట్టారట. ఈ విషయం విన్న తర్వాత అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు.మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: