డీజే టిల్లు, టిల్లూ స్క్వేర్ సినిమాలతో సిద్ధు జొన్నలగడ్డ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జాక్ సినిమాతో సిద్ధు అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. దాదాపుగా అన్ని ఏరియాల్లో జాక్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.
 
ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదు. అయితే జాక్ సినిమాకు సిద్ధు జొన్నలగడ్డ 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రెమ్యునరేషన్ లో కనీసం సగం అయినా ఆయన వెనక్కు ఇస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి సిద్ధు జొన్నలగడ్డ మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది.
 
జాక్ మూవీ అటు సిద్ధు జొన్నలగడ్డ సినిమాలా కాకుండా ఇటు బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలా కాకుండా ఉండిపోవడం మైనస్ అయింది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా ఈ సినిమా ఆమెకు ఏ మాత్రం ప్లస్ కాలేదు. సిద్ధు జొన్నలగడ్డ తర్వాత సినిమా తెలుసు కదా అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. తెలుసు కదా సినిమాకు కోన నీరజ దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఈ సినిమాతో అయినా సిద్ధు జొన్నలగడ్డ మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది. సిద్ధు జొన్నలగడ్డ డైరెక్టర్లకు పూర్తి స్వేచ్చ ఇస్తే సినిమాల ఫలితాలు మరింత మెరుగుపడతాయని డీజే టిల్లు హ్యాంగోవర్ నుంచి బయటపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ వరుస విజయాలు సాధించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయంలో మరింత జాగ్రత్త వహించాల్సి ఉంది.  జాక్ సినిమా ప్రభావం సిద్ధు భవిష్యత్తు సినిమాలపై పడే ఛాన్స్ అయితే ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి: