మలయాళ నటుడు మోహన్ లాల్ తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన L2 ఎంపురన్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాని లూసిఫర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందించారు. సూపర్ సక్సెస్ ను సాధించిన లూసిఫర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన మూవీ కావడంతో మొదటి నుండి కూడా L2 ఎంపురన్ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27 వ తేదీన అత్యంత భారీ ఎత్తున విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 18 రోజుల బాక్సా ఫీస్ రన్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. ఈ 18 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

18 రోజుల్లో ఈ సినిమాకు కేరళ ఏరియాలో 85.65 కోట్ల కలెక్షన్లు దక్కగా , తెలుగు రాష్ట్రాల్లో 4.40 కోట్లు , తమిళనాడులో 9.80 కోట్లు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 22.65 కోట్లు , ఓవర్సీస్ లో 143.25 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 18 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 125.15 కోట్ల షేర్ ... 264.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 102 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది.  18 రోజుల్లో ఈ సినిమాకు 23.15 కోట్ల రేంజ్ లో లాభాలు వచ్చాయి. ఈ మూవీ కి విడుదల అయిన తర్వాత కొన్ని రోజుల పాటు అద్భుతమైన కలెక్షన్లు రావడంతో ఈ సినిమా ఈజీగా 300 కోట్ల టార్గెట్ ను టచ్ చేస్తుంది అని చాలా మంది భావించారు. కానీ ఈ మూవీ కి ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే 300 కోట్ల కలెక్షన్లు అందుకోవడం కష్టం అని చాలా మంది ప్రస్తుతం అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: