ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీలు సడన్ గా పెళ్లిళ్లు చేసుకుంటూ షాకిస్తున్నారు. ఇందులో భాగంగా చాలామంది హీరోయిన్లు ఎంగేజ్మెంట్ జరిగే వరకు కూడా ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు. ఒకవేళ ఎంగేజ్మెంట్ జరిగినా కూడా ఫేస్ లు కనిపించకుండా రహస్యంగా వారి ఫోటోలు పెడుతూ కేవలం చేతి రింగ్స్ వంటివి షేర్ చేస్తూ ఎంగేజ్మెంట్ అయినట్టు హింట్స్ ఇస్తున్నారు. ఇక మరి కొంత మందేమో పెళ్లి అయ్యే వరకు కూడా వారి భాగస్వాములను బయటకు చూపించడానికి ఇష్టపడడం లేదు. అలా తాజాగా ఈ మెగా బ్యూటీ కూడా పెళ్లికి సిద్ధమైంది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ వైరల్ అవుతుంది.మరి ఇంతకీ పెళ్లికి సిద్ధపడిన ఆ మెగా బ్యూటీ ఎవరో ఇప్పుడు చూద్దాం. మెగా హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా చేసిన చిత్రలహరి సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో హీరోయిన్గా కళ్యాణి ప్రియదర్శన్ నటించింది. 

అయితే ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ హీరోయిన్ పాత్రలో చేసిన కళ్యాణి ప్రియదర్శన్ కి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా కంటే ముందే అఖిల్ తో హలో మూవీలో కూడా చేసింది.అలా నాలుగైదు తెలుగు సినిమాలతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా రాణిస్తుంది. అయితే అలాంటి ఈ బ్యూటీ తాజాగా తన పెళ్లి ప్రకటన పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ పోస్టల్ కాస్త వైరల్ అవుతుంది. అయితే పెళ్లి పోస్టర్ అంటే అందరూ నిజంగానే కళ్యాణి ప్రియదర్శిన్ పెళ్లి చేసుకుంటుంది కావచ్చు అనుకుంటారు. కానీ ఆ పోస్టర్ కళ్యాణి ప్రియదర్శన్ నటించే కొత్త సినిమా. ఇక విషయంలోకి వెళ్తే.. ఫాహద్ ఫాజిల్ కళ్యాణి ప్రియదర్శిన్ హీరో హీరోయిన్లుగా అల్తాఫ్ సలీం దర్శకత్వం వహిస్తున్న మలయాళ తాజా మూవీ ఒడుం కుతిర చాడుం కుతిర.. 

ఈ సినిమాకి సంబంధించి అధికారిక ఫస్ట్ లుక్ పోస్టర్ ని నిర్మాత ఆశిక్ ఉస్మాన్ రివీల్ చేశారు. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన కళ్యాణి ప్రియదర్శిన్ పెళ్లి వరకు ప్రేమ కథ ఖచ్చితంగా ఉంది అంటూ ట్యాగ్ జోడించింది. అలాగే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ని రివీల్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది అంటూ కళ్యాణి ప్రియదర్శిన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్టర్లో ఏముందంటే.. ఫాహద్ ఫాజిల్ పెళ్లి కొడుకు గెటప్ లో గుర్రం మీద కూర్చుని ఉంటే.. పెళ్లికూతురు గెటప్ లో ఉన్న కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం షాక్ అయిపోతూ ఫేస్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: