తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో నాని ఒకరు. ఈయన అష్టా చమ్మా అనే మూవీతో హీరోగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే హీరోగా అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే నాని నిర్మాతగా సినిమాలను కూడా నిర్మిస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు ఈయన బ్యానర్లో నిర్మించిన సినిమాలలో అనేక సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం నాని , ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన కోర్టు అనే మూవీ ని రూపొందించాడు.

సినిమా విడుదలకు ముందు నాని మాట్లాడుతూ ... కోర్టు మూవీ అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమా మీకు నచ్చనట్లయితే నేను నిర్మిస్తున్న మరియు నటిస్తున్న సినిమా అయినటువంటి హిట్ 3 మూవీ కి ఎవరూ రాకండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక కోర్టు మూవీ విడుదల అయ్యాక అద్భుతమైన టాక్ ను తెచ్చుకుని సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే నాని నటిస్తూ నిర్మిస్తున్న హిట్ ది థర్డ్ కేస్ మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు పాత్రికేయులతో ముచ్చటించారు. అందులో భాగంగా నాని "హిట్ 3" మూవీ అద్భుతమైన రీతిలో ఉంటుంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుంది. నేను చెప్పింది కాదు అనిపిస్తే నెక్స్ట్ టైం నానిని నమ్మకండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక నాని తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: