నటుడిగా , నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి కళ్యాణ్ రామ్ ఆఖరుగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన బింబిసారా అనే సినిమాతో సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన హీరో గా రూపొందిన అమిగొస్ , డెవిల్ మూవీ లు వరసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వరుసగా రెండు అపజయాల తర్వాత కాస్త టైమ్ తీసుకుని కళ్యాణ్ రామ్ అర్జున్ S/O వైజయంతి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ లో విజయశాంతి , కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. 

మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. కళ్యాణ్ రామ్ ఆఖరుగా నటించిన రెండు మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన అర్జున్ S/O వైజయంతి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో ఈ నటుడు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో అనేది తెలియాలి అంటే మార్చి 18 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

nkr