కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకుల లో ఏ ఆర్ మురగదాస్ ఒకరు. ఈయన కేవలం తమిళ సినిమాలను మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలకు కూడా దర్శకత్వం వహించి వాటిలో కూడా చాలా మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా సూపర్ సాలిడ్ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా ఇండియా వ్యాప్తంగా మంచి దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న మురగదాస్ ఈ మధ్య కాలంలో మాత్రం భారీ స్థాయి విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనకబడిపోయాడు.

కొన్ని సంవత్సరాల క్రితం ఈయన దర్బార్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని మురుగదాస్ హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ మూవీ ని ఓకే చేసుకున్నాడు. అలాగే తమిళ నటుడు శివ కార్తికేయన్ హీరోగా మదరాసి అనే మూవీ ని ఓకే చేసుకున్నాడు. ముందుగా మురగదాస్ , సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందిన సికిందర్ మూవీ ని కంప్లీట్ చేశాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా భారీ అపజయాన్ని అందుకుంది. 

సినిమా ఫెయిల్యూర్ కావడంతో మురగదాస్ తదుపరి మూవీ పై కూడా అంచనాలు తగ్గే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. తాజాగా మురగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న మదరాసి సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కనుక విజయం సాధించినట్లయితే మురగదాస్ క్రేజ్ చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: