మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా కొంత కాలం క్రితం ధమాకా అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ , శ్రీ లీల కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి.ఈ మూవీ కి బీమ్స్ సంగీతం అందించాడు. ఈ మూవీ కి అద్భుతమైన మాస్ బీట్ ఉన్న సాంగ్స్ ను బిమ్స్ ఇచ్చాడు.

అలాగే ఆ సాంగ్స్ లలో రవితేజ , శ్రీ లీల తమ అద్భుతమైన డాన్స్ స్టెప్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా ప్రస్తుతం మాస్ జాతర అనే మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూలై నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి కూడా బీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుండి తూ మేరా లవర్ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన ఈ సాంగ్ మంచి మాస్ బీట్లో సాగుతుంది. అందులో రవితేజ , శ్రీ లీల కూడా అదిరిపోయే రేంజ్ లో స్టెప్స్ వేనున్నట్లు తెలుస్తోంది.

ధమాకా సినిమాలో శ్రీ లీల తన నటనతో , అందంతో , డాన్స్ తో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో ఈ సినిమాలో కూడా అదే రేంజ్ లో తన అందాలతో , డ్యాన్స్ తో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా భీమ్స్ సంగీత సారధ్యంలో రూపొందిన ధమాకా మూవీ మంచి విజయం సాధించడంతో వీరి ముగ్గురు కాంబోలో రూపొందుతున్న మాస్ జాతర మూవీ కూడా మంచి విజయం సాధిస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: