
కొన్ని సంవత్సరాల క్రితం షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్గా చెన్నై ఎక్స్ప్రెస్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రియమణి ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అలాగే ఈ మూవీ లో ప్రియమణి చేసిన స్పెషల్ సాంగ్ జీ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ప్రియమణికి , షారుక్ ఖాన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం రావడంతో తన అభిమాని నటుడి సినిమాలో అంత గొప్ప అవకాశం రావడంతో ఆమె ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా షారుక్ ఖాన్ కోసం ఆ సినిమాలో నటించిందట. అలా షారుక్ మీద తనకున్న అభిమానాన్ని ప్రియమణి చూపినట్లు తెలుస్తుంది. ఇకపోతే షారుక్ నటించిన జవాన్ మూవీ లో కూడా ప్రియమణి నటించింది. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.