
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర నుంచి తొలి పాట బయటకు వచ్చింది. ‘ రామ .. రామ ’ అంటూ సాగే ఈ పాటని హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం. కీరవాణి ట్యూన్ బాగుంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాట ను చక్కటి పదాల తో పేర్చుకుంటూ బాగా రాశారు. పాటలో కొన్ని విజువల్స్ లిరికల్ వీడియోలో కనిపించాయి. ఇక చిరు లుక్ అయితే కాస్త కొత్తగానే అనిపించింది. సీజీ వర్క్ విషయంలో గత టీజర్‌లో విమర్శలు రావడంతో ఈ సారి జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించింది. శోభి మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ పాటకు అక్షరాలా రూ. 6 కోట్లు ఖర్చయ్యాయని చర్చ జరుగుతోంది.
ఇక ఈ పాట కోసం 4 భారీ సెట్లు వేశారు. 400 మంది డాన్సర్లు, 400 మంది జూనియర్లు, 15 మంది నటీనటులు ఈ పాటలో కనిపిస్తారని మేకర్స్ చెప్పారు. మొత్తం 12 రోజుల పాటు ఈ పాటను షూట్ చేశారంటే సినిమా లో ఈ పాటకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలుస్తోంది. లిరికల్ వీడియోలో ఈ పాట మేకింగ్ క్వాలిటీ బాగానే కనిపించింది. సినిమాలో ఈ పాట మరింత కలర్ ఫుల్ గా ఉంటుందట. ఇక పాట కోసం వేసిన సెట్లు అయితే కలర్ ఫుల్ గా తెరమీద చూస్తున్నప్పుపడు ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేసేలా ఉంటాయంటున్నారు.
ఇప్పటికే పలు సార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమాను జులై 24న ఈ సినిమాని విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. సీనియర్ బ్యూటీ త్రిష కథానాయికగా నటించిన ఈ సినిమా కి మల్లిడి వశిష్ట దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.