ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అల్లు అర్జున్ - పవన్ కళ్యాణ్ మీట్ అవ్వడమే పెద్ద హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . అదే విషయాన్ని ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ టాపిక్ ఎంతలా ట్రెండ్ అవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే చాలామంది పవన్ కళ్యాణ్ ను మీట్ అయి బన్నీ మంచి పని చేశాడు అని..  ఇక ఆయన కెరీర్ కి అడ్డంకులు ఉండవని మంచి నిర్ణయం తీసుకున్నాడు అని అంటుంటే .. కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ మీట్ అవ్వడం వెనక చాలా పెద్ద స్కెచ్ ఉంది అని.. అల్లు అర్జున్ ఏదో ప్రేమతో పవన్ కళ్యాణ్ కొడుకును చూడడానికి ఇంటికి వెళ్ళలేదు అని..


ఈ సాకుతో ఆయన తన నెక్స్ట్ సినిమాల విషయంలో ట్రోలింగ్ తప్పించుకోవడానికి ఈ విధంగా ప్లాన్ చేశాడు అని మాట్లాడుకుంటున్నారు.  మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ కొడుకు సింగపూర్ లో చదువుకుంటున్నాడు . అక్కడ యాక్సిడెంట్ జరిగింది . పవన్ కళ్యాణ్ కొడుకు గాయపడ్డారు . రీసెంట్ గానే ఇండియాకి తిరిగి వచ్చాడు. ఈ మూమెంట్ లోనే అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి ఇద్దరు కలిసి వెళ్లి మరి మార్క్ శంకర్ ను పరామర్శించారు . అయితే ఇది టోటల్గా వాళ్ళ వ్యక్తిగతంగా ఉండే విషయం.



 కానీ కొంతమంది మాత్రం పొలిటికల్ గా లాగుతూ వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు. మరి కొంతమంది సినిమా కోసమే అల్లు అర్జున్ ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు అని .. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అల్లు అర్జున్ కి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు ఆ కారణంగానే ఈ విధంగా ముందు నుంచి పక్కాగా ప్లాన్ తో వెళ్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు.  అల్లు అర్జున్ - పవన్ కళ్యాణ్ మీట్ అవ్వడం వెనక  ఇంత పెద్ద స్కెచ్ ఉంది అన్న విషయం  సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే విషయంపై ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు. బన్నీ - పవన్ ఫ్యాన్స్ మాత్రం కూసింత కూల్ గానే ఉన్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: