సాధారణంగా సెలబ్రిటీలు ఏ పని చేసిన దాన్ని అభిమానులు ఇట్టే ఫాలో అయిపోతారు. అందుకే సెలబ్రిటీల ద్వారా జనాలకు మంచి విషయాలు చెబితే అవి చాలా చక్కగా వారి మెదళ్లకు చేరుతాయి. అయితే ప్రస్తుతం సినీ సెలబ్రిటీలు చాలా వరకు సినిమాలు  తీస్తే అవి జనాలపై ఎఫెక్ట్ చూపి సినిమాల్లో ఉన్న విధంగానే కొంతమంది ఫాలో అవుతున్నారు. అది మంచి విషయాలను ఫాలో అయితే ఏం కాదు కానీ చెడు విషయాలను స్వీకరిస్తే మాత్రం సమాజానికి నష్టమే అని చెప్పవచ్చు. అలా సెలబ్రిటీ ఫ్యామిలీలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగా ఫ్యామిలీ.. మెగా ఫ్యామిలీలో ఈమె సినిమాల్లో నటించకపోయినా కానీ ఒక హీరోయిన్ కు ఉండే అంత క్రేజ్ సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే మెగా కోడలు ఉపాసన.. 

మొదట్లో రామ్ చరణ్ కు ఈమె భార్యగా సెట్ కాలేదని మెగా అభిమానులు వ్యతిరేకించారు. ఆ తర్వాత కాలంలో ఆమె అపోలో హాస్పిటల్ కు చైర్మన్ గా కావడం సామాజిక కార్యక్రమాలు చేయడం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, మెగా ఫ్యామిలీకి అండగా నిలుస్తూ ఒక మంచి కోడలుగా పేరు తెచ్చుకోవడంతో  మెగా అభిమానులు కూడా మెగా ఇంటి అదృష్ట లక్ష్మి పొగుడుతున్నారు. అలాంటి ఉపాసన సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు అభిమానులతో కొన్ని విషయాలను పంచుకుంటుంది.. నా అత్తతో కలిసి వంటలు చేస్తూ వాటిని పోస్ట్ చేస్తుంటుంది.

అయితే తాజాగా ఉపాసన  నెగిటివ్ ఆలోచనలు ఎలా తీసేసుకోవాలో కూడా తెలియజేసింది.  తనలో నెగిటివ్ ఆలోచనలు ఉంటే కొన్ని సాల్వ్ చేసుకుంటాను. పరిష్కారం దొరకని ఆలోచనలను ఒక తెల్ల పేపర్ పై రాసుకొని, వాటిని కాల్చిపారేస్తానని చెప్పుకొచ్చింది. దీనివల్ల నాలో ఉన్న స్ట్రెస్ తగ్గిపోయి రిలీఫ్ అవుతానని అలా హాయిగా నిద్రపోతానని అన్నది. అంతే కాదు ఎవరికైనా  పడుకునే సమయంలో స్ట్రెస్ ఫీల్ అయితే నెగిటివ్ ఆలోచనలు ఈ విధంగా తీసేయాలని వారికి సజెషన్ చేసింది. ప్రస్తుతం ఆమె నేర్పిన స్ట్రెస్ థెరపి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: