టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించిన వాటి ద్వారా ఈయనకు పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. అలా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈయన డీజే టిల్లు అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఈయనకు తెలుగులో సూపర్ సాలిడ్ క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత సిద్దు "టిల్లు స్క్వేర్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ఏకంగా 130 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 

మూవీ తో సిద్దు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇలా వరుసగా రెండు విజయాలతో ఫుల్ జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తున్న ఈయన తాజాగా జాక్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ ప్రస్తుతం పెద్ద స్థాయిలో కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టడం లేదు. ఈ మూవీ సిద్దు కెరియర్ లో భారీ అపజయాల లిస్టులోకి చేరే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం సిద్దు "తెలుసు కదా" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో రాసి కన్నా , శ్రీ నిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే జాక్ మూవీతో భారీ అపజయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్న సిద్దుకు తెలుసు కదా సినిమాతో కూడా అలాంటి అనుభవం ఎదురైనట్లయితే ఆయన కెరియర్ కాస్త కష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి తెలుసు కదా సినిమాతో సిద్దు ఏ స్థాయి  విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: