
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరో గా దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ మూవీ హిట్ 3 .. నాని హీరో గా అలాగే నిర్మాత గా కూడా ఈ సినిమా ను చేశాడు .. అయితే ఈ సినిమా పై ఇప్పుడు భారీ అంచునాలు నెలకొన్నాయి .. అలాగే తాజా గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ట్రైలర్ తో అంచనాలు మరింత పెరిగిపోయాయి అని కూడా చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు . అయితే ఎప్పుడు ఈ సినిమా విషయం లో నాని ఎంత నమ్మకంగా ఉన్నాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది .. ఇక తన నిర్మాణం లో రీసెంట్గా వచ్చిన మూవీ కోర్టు ప్రమోషన్స్ లో తాను చెప్పిన మాటలు ఎలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే ..
కోర్టు సినిమా నచ్చకపోతే తన హిట్ 3 సినిమా అని ఎవరు చూడద్దని ఎంతో నమ్మకం గా నాని ఆ సమయం లో చెప్పుకొచ్చాడు .. ఇక ఇప్పుడు కట్ చేస్తే కోర్ట్ సూపర్ హిట్ అయింది .. అలాగే ఇప్పుడు హిట్ 3 విషయం లో కూడా అదే తరహా నమ్మకాన్ని నాని వ్యక్తం చేస్తున్నాడు .. హిట్ 3 సినిమా కానీ ప్రేక్షకులకి ఒక కొత్త థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోతే ఇక తర్వాత నుంచి తన సినిమాలు అసలు చూడొద్దంటూ బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు .. ఇక దీంతో నాని హిట్ 3 విషయం లో ఎంత నమ్మకంగా ఉన్నాడో అంత అర్థం చేసుకోవచ్చు . ఇక మరి పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న హిట్ 3 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసి నాని పెట్టుకున్న నమ్మకాలను ఎంతవరకు నిజం చేస్తుందో చూడాలి ..