బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయిన‌ అన్ని సినిమాలకు పోస్టుమార్టం అనేది అవసరం లేదు .  కొన్ని సినిమాలకు మాత్రమే ఇది ఎంతో తప్పనిసరి అవుతుంది .. ప్రస్తుతం ఈ సీజన్లో అలా మాట్లాడుకోవాల్సిన సినిమా జాక్ .. చిన్న సినిమాల్లోనే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది జాక్ .. కానీ అందరి అంచనాలకు భిన్నంగా ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది .. జాక్ సినిమా నుంచి ప్రేక్షకులు ఊహించింది వేరు .  సిద్దు జొన్నలగడ్డ నుంచి వాళ్ళు ఒకటి ఆశిస్తే మేకర్స్‌ ఇంకోటి ఇచ్చారు .. వీటికి తోడు తన మార్క్ మేనేరిజం కామిడీ నుంచి సిద్దు కొంత పక్కకు రావటం ప్రేక్షకులకు అసలు నచ్చలేదు .  


ప్రస్తుత కాలంలో ఓ సినిమాకు రిలీజ్ కు ముందే హైప్‌ రావాలంటే కనీసం ఒక్కపాటైన బాగా హీట్ అవ్వాలి .. అలాగే అందులో ఒక హుక్ మూమెంట్ అయినా ఉండాలి .. రీల్స్ లో సోషల్ మీడియాలో బాగా దద్దరిల్లిపోవాలి అలాంటి ట్రెండింగ్ ఏది జాక్ లో కనిపించలేదు .. అలాగే ఈసారి మ్యూజిక్ విషయంలో సినిమా వారంతా ఫెయిల్ అయ్యారని విడుదలకు ముందే హీరో చెప్పాడంటే సినిమా పరిస్థితి ఏంటో అంత అర్థం చేసుకోవచ్చు . ఇక వీటికి తోడు సినిమాను ఎలా తీయాలని అంశంపై హీరో దర్శకులు ఏక అభిప్రాయానికి వచ్చినట్టు కనిపించలేదు .  కొన్నిచోట్ల సీరియస్ గా కొన్నిచోట్ల మరి సిల్లీగా సినిమాను తీశారు .. సినిమాలో సిద్దు మినహా మరో పుల్లింగ్ ఫ్యాక్టర్ లేకపోవడం కూడా జాక్ కు ప్రతికూల అంశంగా తయారైంది .


నా సినిమా నా ఇష్టం అంటూ హీరో సిద్దు జొన్నలగడ్డ ఎలాగైనా ఈ సినిమాను చేసుకోవచ్చు .. అవసరమైతే కొన్ని సందర్భాల్లో దర్శకుడు సైతం పక్కనపెట్టి దాని అన్ని చూసుకోవచ్చు .  కానీ ఫైనల్ గా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది కచ్చితంగా చెక్ చేసుకోవాలి .  బహుశా , అప్పటికే ఆ పరిస్థితి చేయి దాటిపోయి ఉండొచ్చు దాని ఫలితం ఇప్పుడు థియేటర్లో కనిపిస్తుంది .. మొదటి వీకెండ్ గడిచేసరికే చాలా స్క్రీన్స్ నుంచి జాక్‌ సినిమాను పక్కకు తప్పించారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: