మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టి ఈయన ఎన్నో విజయాలు అందుకున్నారు .. అలాగే కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు . తెలుగు సినిమా అంటే చిరంజీవి ... చిరంజీవి అంటే తెలుగు సినిమా అనే బ్రాండ్ గా మార్చుకున్నారు ..  వెండితెరపై చిరు కనిపిస్తే పెద్ద అరాచకం .. అలాగే ఆయన డైలాగులు చెబుతుంటే అభిమానులు ఉప్పొంగే ఆనందం .  ఇలా ఒక్కటేంటి ఆయన ఏమి చేసినా అభిమానులకు పెద్ద పండగే .. గతంలో ఏ ఇంట్లో చూసినా చిరంజీవి ఫోటో కచ్చితంగా ఉండేది ..


అలాంటి చిరంజీవి తన బెడ్ రూమ్ లో ఓ హీరోయిన్ ఫోటో పెట్టుకున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా .. అవును ఈ మాట మీరు కచ్చితంగా నమ్మి తీరాలి .. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా .. మహానటి సావిత్రి .  ఈ దివంగత లెజెండ్ హీరోయిన్ ఫోటో కరెక్టుగా చిరంజీవి బిడ్డకు ఎదురుగా ఉంటుందట .  ప్రతిరోజు ఉదయం లేవ‌గానే ముందు ఆమె మొహాన్ని చిరంజీవి చూస్తారట .. ఇదే విషయాన్ని స్వయంగా సావిత్రి కూతురు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .. ఒకసారి సావిత్రి కి సంబంధించిన కార్యక్రమానికి ఆహ్వానించడానికి చిరంజీవి ఇంటికి వెళ్లారు సావిత్రి కూతురు విజయ .. అప్పుడు ఆయన ఆమెతో మాట్లాడుతూ  .. నా రూమ్లో సావిత్రి అమ్మ ఫోటో ఎప్పుడూ ఉంటుంది ..


ఉదయాన్నే ఆమె మొఖాన్ని నేను చూస్తానని చెప్పారట చిరంజీవి .  ఇక మీరు నమ్ముతారో లేదో అని పైన ఉన్న తన బెడ్ రూమ్ నుంచి ఆ ఫోటోను తెప్పించి మరి ఆమెకు చూపించారట .. అలా చిరంజీవి బెడ్రూంలో సావిత్రి ఫోటో చూసి ఆనందంగా ఫీల్ అయినట్టు ఒక ఇంటర్వ్యూలో సావిత్రి కూతురు విజయ చెప్పకు వచ్చారు .. ఇక చిరంజీవి కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో సావిత్రి ఒకసారి ఆయన్ని పిలిచి మరి అభినందించినట్టు పలు వేదికల్లా కూడా చెప్పుకొచ్చారు .. మరి ప్రస్తుతం టాలీవుడ్ కు అడుగుపెట్టే హీరోలకు చిరు ఎంతో స్ఫూర్తి  .. అయితే చిరుకు మాత్రం సావిత్రి గారు స్ఫూర్తి .

మరింత సమాచారం తెలుసుకోండి: