
ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై ఈ తరహ పోలీస్ కథ రాలేదని దర్శకుడు సందీప్ వంగా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పక వచ్చాడు .. ఇక దీంతో ఈ సినిమా పై అంచనాలు కూడా ఆ మాంతం పెరిగిపోయాయి .. అయితే ఈమధ్య భారీ సినిమాల్లో విలన్ పాత్ర ఎంతో స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు .. అలాగే అందుకోసం స్టార్ హీరోలను సైతం విలన్ గా మారుస్తున్నారు .. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ స్పిరిట్ సినిమాలో కూడా అదే ప్లాన్ చేస్తున్నారట .. ఇక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా ఎంతో బలంగా ఉంటే హీరో కూడా అంత బాగా ఎలివేట్ అవుతాడనేది దర్శకుడు రాజమౌళి ఐడియాలజీ ..
ఇక స్పిరిట్ విషయంలో కూడా సందీప్ ఇదే రూట్ ను ఫాలో అవుతున్నాడట .. ఇప్పటివరకు ఎవరు ఊహించని విధంగా ప్రభాస్ విలన్ గా ఓ స్టార్ హీరోని తీసుకురాబోతున్నాడట .. ఇంతకి ఆయన మరెవరో కాదు మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి . ఈ సినిమా లో ఆయన పాత్ర ఎవరు ఊహించిన రేంజ్ లో ఉండబోతుందని టాక్ . అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన బయటకు రానప్పటికీ .. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ గా మారింది .