ఇన్నాళ్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా పవన్ కళ్యాణ్ - బన్నీ మాట్లాడుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ - బన్నీ మధ్య వార్ జరుగుతుంది. ఆ వార్ కాస్త మెగా వర్సెస్ అల్లు ఫాన్స్ వార్ గా మిగిలిపోయింది. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇదేవిధంగా వార్తలు వినిపించాయి . ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా బాగా ట్రెండ్ అయ్యింది. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ - పవన్ కళ్యాణ్ కలిశారు. మీట్ అయ్యారు. మాట్లాడుకున్నారు . దీనితో పవన్ ఫ్యాన్స్ కూల్ అయిపోయారు .


నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్నవాళ్లు ఇప్పుడు పాలు నీళ్లు లాగా కలిసిపోయారు . ఓకే అంతా బాగుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి కారణంగా మధ్యలో బకరా అయ్యింది మాత్రం ఒక స్టార్ హీరో అనే మాట్లాడుకుంటున్నారు జనాలు.  నిజానికి మెగా ఫ్యామిలీలో చిరంజీవికి రామ్ చరణ్ కి అల్లు అర్జున్ కి అల్లు అరవింద్ కి ఎలాంటి వార్ లేదు . అల్లు అర్జున్ ఏదో పార్టీకి సపోర్ట్ చేశారు . అది జనసేన పార్టీకి అపోజిషన్ గా ఉంది . అంతే అంతవరకే . అయితే ఈ చిన్న పాయింట్ ని పెద్దవార్ గా మార్చేశారు జనాలు .



మధ్యలో రాంచరణ్ ని బకరాగా మార్చేశారు . రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా అట్టర్ ప్లాప్ చేసేసారు . అల్లు అర్జున్ ఫ్యాన్స్ చరణ్ ని ట్రోల్ చేస్తే రామ్ చరణ్ ఫాన్స్ బన్నీ ని ట్రోల్ చేశారు . పుష్ప సినిమా కారణంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మెగా ఫాన్స్ చేసిన హంగామా ..గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పడిన ఆనందం ఎప్పటికీ మర్చిపోలేనిది . అయితే ఇప్పుడు అల్లు అర్జున్ - పవన్ కళ్యాణ్ కలిసిపోవడంతో మధ్యలో బకరాగా మిగిలిపోయాడు రామ్ చరణ్ అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మింగిల్ అయిపోయారు . ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మాత్రమే ఏకాకీగా మిగిలిపోయారు అంటూ దారుణాతి దారుణంగా ట్రోల్ చేసేస్తున్నారు . ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ పేరు  పై విపరీతంగా నెగిటీవ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: