
అల్లు అర్జున్ - పవన్ కళ్యాణ్ కొడుకుని పరామర్శించడానికి పవన్ ఇంటికి వెళ్లారు. అక్కడ దాదాపు గంటన్నర పాటు వీళ్ళు మాట్లాడుకున్నారు . దేని గురించి మాట్లాడుకున్నారు అనే విషయాలు పక్కనపడితే పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ కలవడమే పెద్ద మ్యాటర్ అంటూ ఫీల్ అయిపోతున్నారు అభిమానులు . అయితే పవన్ కళ్యాణ్ గతంలో అల్లు అర్జున్ కి అపార్ట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన కావాలనే ఇవ్వలేదా..? లేక వేరే కారణలతో ఇవ్వలేదా..? అనే విషయం ఇప్పటికి బిగ్ క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది.
మరి ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకు అల్లు అర్జున్ ని కలిశాడు అంటే మాత్రం మాటల మాంత్రికుడు శ్రీనివాసరావు అంటున్నారు జనాలు . పవన్ కళ్యాణ్ కి జాన్ జిగిడి దోస్త్ త్రివిక్రమ్ . అల్లు అర్జున్ కి గురూజీ అంతే . ఇప్పుడు వీళ్ళిద్దరిని కలపడానికి మధ్యలో పెద్ద పిల్లర్ గా మారిపోయి మరి తన ప్లాన్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాడు త్రివిక్రమ్ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ ని కలిపిన ఘనత మొత్తంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దే అంటూ ప్రశంసించేస్తున్నారు. అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ ఓ దేవుడిలాంటి వాడు. ఏం చెప్పనా సరే నో అనడు. త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ దేవుడు లాంటివి వాడు. ఆయన ఏం చెప్పిన నో అనడు . పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ ఏమైనా చేస్తాడు అది అందరికీ తెలిసిందే ..!