
ఇప్పుడు చాలామంది పాన్ ఇండియా స్టార్స్ అలానే చేస్తున్నారు . ఒక్కరంటే ఒక్కరు కూడా ఫ్లాప్ అయిన డైరెక్టర్ కి అవకాశాలు ఇవ్వడం లేదు . ఎవరో టైర్ 2 హీరోలు మాత్రమే అలా చేస్తున్నారు . అది కూడా వాళ్లకు అవకాశాలు ఇచ్చే వాళ్ళు లేకపోవడం వల్లనే అనే విషయం అందరికీ తెలుసు. అయితే సినిమా ఇండస్ట్రీలో హ్యూజ్ పాపులారిటి సంపాదించుకున్న విజయ్ సేతుపతి మాత్రం ఫామ్ లో ఉన్న డైరెక్టర్ కి ఫామ్ లో లేని డైరెక్టర్ కి ఈక్వల్ గా ఛాన్సెస్ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా రెమ్యూనరేషన్ తో అనవసరమని తాను నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని గట్టిగా ప్రయత్నిస్తున్నారు .
ఇదే మూమెంట్లో రీసెంట్గా ఆయనకు ఒక ప్రశ్న ఎదురయింది. ఫామ్ లో లేని పూరీ జగన్నాథ్ కు ఎందుకు ఛాన్స్ ఇచ్చారు..? అంటూ రిపోర్టర్ ప్రశ్నించగా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు విజయ్ సేతుపతి . "నా వరకు నేను నమ్మేది డైరెక్టర్ ని.. కధా కంటెంట్ మాత్రమే ...ఫామ్ లో ఉన్నాడా ఫామ్ లో లేడా నాకు అనవసరం.. పూరి జగన్నాథ్ గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది .. కొత్తగా అనిపించింది నాకు చేయాలి అనిపించింది అందుకే ఓకే చేశాను. సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా నాకు అనవసరం . నా పాత్ర జనాలకు నచ్చిందా ..ఎంటర్టైన్ అయ్యారా.. మెసేజ్ తీసుకున్నారా.. అంతవరకే ఆలోచిస్తాను . డైరెక్టర్ ఫామ్ లో లేకపోతే అవకాశాలు ఇవ్వకూడదా ఏంటి..? గతంలో ఆ డైరెక్టర్ ఏ సినిమాలు చేశాడు వాటి ఫలితాలు ఏమిటి అని చూసుకొని అవకాశాలు ఇచ్చే టైపు నేను మాత్రం కాదు "అంటూ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేశారు. దీంతో విజయ్ సేతుపతి పై ఉన్న గౌరవం మరింత స్థాయిలో పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ప్రజెంట్ విజయ్ సేతుపతి మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి..!