
కావ్య థాపర్ కు తమిళ్ ఇండస్ట్రీలో పెద్దగా కలిసి రాలేకపోవడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీ వైపే అడుగులు వేసింది. అలా ఒక ఏడాదిలోనే హీరో రవితేజ సరసన ఈగల్ సినిమాలో సందీప్ కిషన్ తో ఊరి పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలలో నటించింది. ఇక విశ్వం సినిమాలో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇందులో ఊరి పేరు భైరవకోన వంటి సినిమా మాత్రమే ఈమెకు కాస్త ఊరట ఇచ్చింది. కావ్య థాపర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి ఒక టాలీవుడ్ హీరో అంటే ఇష్టమని తెలియజేసింది.
తన ఫేవరెట్ హీరో ఎవరని యాంకర్ అడగగా అందుకు కావ్య రామ్ చరణ్ అంటూ తెలియజేసింది అంతేకాకుండా తన ఫస్ట్ క్రష్ కూడా రామ్ చరణ్ అంటూ తెలియజేయడంతో అభిమానుల సైతం ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. రామ్ చరణ్ చాలా క్యూట్ గా స్మైల్ ఇస్తారని అందుకే తనకు చాలా ఇష్టమని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. ఈమె మాటలు విన్న తర్వాత అభిమానులు చరణ్ అంటే కావ్య కు అంత పిచ్చా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కావ్య థాపర్ కి రామ్ చరణ్ సినిమాలు అవకాశాలు లభిస్తాయి ఏమో చూడాలి మరి.